చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
NEWS Sep 10,2024 01:10 pm
మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం సభ్యులు పూలమాలలు వేసి, ఆమె పోరాట స్ఫూర్తిని కొనియాడుతూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోచంపల్లి రాజ మల్లయ్య, రమేష్, గంగయ్య, శైలేష్, నర్సయ్య, రాజు, రవి, శ్రీధర్, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.