గంజాయి తరలిస్తుండగా పట్టివేత
NEWS Sep 10,2024 11:55 am
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని చిరాగ్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఆనంద్ ధాబా ముందు ఎన్‌హెచ్-65 రోడ్ పై వాహనాల తనిఖీల్లో హైదరాబాద్ వైపు నుండి అనుమానాస్పదంగా వస్తున్న వైట్ కలర్ మహీంద్ర బోలెరో వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనా ట్రాలీ క్రింది భాగంలో చెక్కలను ఏర్పాటు చేసి దాని క్రింద 140 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్స్ ఉన్నట్లు గుర్తించి ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు, గంజాయిని, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పి రూపేష్ తెలిపారు.