ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి
NEWS Sep 10,2024 01:10 pm
సిరిసిల్ల జిల్లా: చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి,నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రమేష్,రాజేశ్వర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్,ఆయా శాఖల జిల్లా అధికారులు, రజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.