రైతులకు ఆధార్ తరహా ఐడీ కార్డులు
NEWS Sep 10,2024 05:57 am
రైతులకు ఆధార్ తరహాలో ప్రత్యేక ID కార్డులు జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసే లక్ష్యంతో అక్టోబర్ నుంచి వీటిని జారీ చేయనుంది. దీనిని పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే UP, మహారాష్ట్రలో అమలు చేసింది. మరో 19 రాష్ట్రాలు కూడా ఇందుకు అంగీకరించాయని కేంద్రం వెల్లడించింది. ప్రభుత్వ స్కీమ్‌లు, కనీస మద్దతు ధరకు పంటల అమ్మకం, కిసాన్ క్రెడిట్ కార్డు వాడకంలో ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది.