వందశాతం రుణమాఫీ అయిందని పోజులు కొట్టిన సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెంట్లవెల్లి రైతుల గోడు తీర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘రుణమాఫీ పూర్తి అని చెప్పిన CM మాటలు బూటకం అనేదానికి నాగర్ కర్నూలు జిల్లాలోని పెంట్లవెల్లి సజీవ సాక్ష్యం. 499 మంది రైతుల్లో ఒక్కరంటే ఒక్కరికీ రుణమాఫీ కాకపోవడం పచ్చిమోసం కాక మరేమిటి ? వీరికి రుణమాఫీ ఎందుకు కాలేదో సీఎం సమాధానం చెప్పాలి’ అని ట్వీట్ చేశారు.