మాకూ హైడ్రా లాంటి వ్యవస్థ కావాలి
NEWS Sep 10,2024 05:59 am
మల్యాల మండల కేంద్రానికి చెందిన గంగపుత్రులు తమ గ్రామంలోనూ హైడ్రాను అమలు చేయాలని కోరుతూ సోమవారం జగిత్యాల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమ గ్రామ పరిధిలోని మత్తడి చెరువు, సూరప్ప చెరువులలోని ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్లలో సాగుతున్న ఆక్రమణలకు అడ్డుకట్ట వేసి తమకు న్యాయం చేయాలని కలెక్టర్ ను కోరారు. హైడ్రా తరహాలో మల్యాల మండలంలోని అక్రమ నిర్మాణాలను తొలగించి, నీటి వనరులను పరిరక్షించి మత్స్యకారులైన తమ ఉపాధిని కాపాడాలని గంగపుత్రులు కోరారు.