ఐఫోన్ 16 ఫీచర్లు ఇవే..
NEWS Sep 10,2024 05:50 am
ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు వచ్చేశాయి. యాపిల్ ఇంటెలిజెన్స్, పెద్ద సైజు డిస్‌ప్లేలు, ప్రో-కెమెరా ఫీచర్లు, భారీ బ్యాటరీ లైఫ్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ఏ18 ప్రో చిప్‌తో పనిచేసే iPhone 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్‌లు కొత్త 48ఎంపీ ఫ్యూజన్ కెమెరాతో పాటు స్పీడ్ క్వాడ్-పిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటాయి. అలాగే ఈ ఫోన్లతో డాల్బీ విజన్‌లో 4k120 FPS వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ బ్లాక్ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం, డెజర్ట్ టైటానియం రంగులలో అందుబాటులో ఉంటాయి. 128జీబీ, 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ వెర్షన్లలో అందుబాటులో ఉంటాయి.