యాపిల్ కొత్త ఐఫోన్ 16 సిరీస్ లాంచ్
NEWS Sep 10,2024 05:30 am
కొత్త ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను యాపిల్ లాంచ్ చేసింది. ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర రూ. 119,900, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ. 144,900, ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ధరలు వరుసగా రూ. 79,900, రూ. 89,900గా నిర్ణయించింది. మన దగ్గర ఈ నెల 13 నుంచి ముందస్తు బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. యాపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ 4, ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ కూడా లాంచ్ చేసింది.