హైదరాబాద్ సిగలో మరో మణిహారం
NEWS Sep 10,2024 05:23 am
హైదరాబాద్‌కు అనుబంధంగా కొత్తగా ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీని నిర్మిస్తోంది. స్కిల్ యూనివర్సిటీ, టూరిజం, హెల్త్, స్పోర్ట్స్, వినోద కేంద్రాల సమాహారంగా ఫ్యూచర్ సిటీ ఉంటుంది. ఫ్యూచర్ సిటీలో మరో వరల్డ్ క్లాస్ సెంటర్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఇందులో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రారంభించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ తరహాలో హైదరాబాద్‌లోనూ ఏర్పాటుకు వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సిద్ధమయ్యారు.