సొసైటీల్లో లేకపోయినా ఇంటి స్థలాలు
NEWS Sep 10,2024 04:56 am
సొసైటీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలం అందుతుందని మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. 18 ఏళ్ల గోస సీఎం చేతుల మీదుగా జవహార్ లాల్ నెహ్రూ సొసైటీకి స్థలం అప్పగింత పత్రాలతో తీరిందన్నారు. ఇతర జర్నలిస్టులు అనుమానాలు, అపోహలకు గురికావొద్దని, వర్కింగ్ జర్నలిస్టులం దరికి అక్రిడిటేషన్‌తో సంబంధం లేకుండా, సొసైటీలతో సంబంధం లేకుండా దరఖాస్తులు ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు.