పోడు పట్టాలు మంజూరు చేయాలి
NEWS Sep 10,2024 04:43 am
అరకు: పిఎం జన్ మన్ పథకంలో అర్హులైన వారికి పోడు పట్టాలు అందించాలని, మంజూరైన ఇళ్లకు తక్షణం అమౌంట్ విడుదల చేయాలని సుంకరమెట్ట సర్పంచ్ గెమ్మెలి చిన్నబాబు డిమాండ్ చేశారు. సాంకేతిక కారణాల వలన అర్హత కోల్పోయిన వారికి కూడా ఇళ్లు మంజూరు చేయాలని సర్పంచ్ కోరారు. ఈ మేరకు సర్పంచ్ చినబాబు దాబుగూడ గ్రామంలోని పివిటీజీలతో నినాదాలు చేశారు. గ్రామస్తులు ప్రేమ్ కుమార్, విజయ్, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.