మాడగడకు మోడల్ కాలనీ నిర్మించాలి
NEWS Sep 10,2024 06:02 am
అరకు: తుఫాన్ కారణంగా నష్టాలను పరిశీలించేందుకు మాడగడ పంచాయతీలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉమామహేశ్వర రావు, కిండంగి రామారావు పర్యటించారు. సిపిఎం నాయకులు మాట్లాడుతూ.. భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇళ్ల కు పరిహారం అందించాలని, నిత్యవసరాలు సప్లై చేయాలని డిమాండ్ చేశారు. మాడగడ గ్రామంలో 500 మీటర్ల మేర కొత్తగా డ్రైనేజ్ మంజూరు చేయాలన్నారు. కొండ వాలున ఉన్న మాడగడ గ్రామస్తుల కోసం కొత్త మోడల్ కాలనీని నిర్మించాలని డిమాండ్ చేశారు.