జగిత్యాల: తనకు వికలాంగుల పెన్షన్ తో పాటుగా బ్యాటరీ సైకిల్ ఇవ్వాలని ఓ దివ్యాంగుడు జగిత్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశాడు. కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన సాయిలు అయిదేళ్ల క్రితం ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. అప్పటి నుంచి పనులకు వెళ్లలేక కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు వాపోయాడు.