ముంచింగిపుట్టు: ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు జలాశయంకు వరదనీరు పోటెత్తింది. సోమవారం జోలాపుట్ జలాశయం ఇన్‌ఫ్లో భారీగా చేరుతుండడతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జోలాపుట్టు జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 2,750 అడుగులు కాగా, సోమవారం 2,549.20 అడుగులకు చేరింది. దీంతో ఆరు గేట్లు ఎత్తి దిగువకు 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.