డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దరఖాస్తు
స్వీకరణ పొడగింపు
NEWS Sep 10,2024 05:54 am
జగిత్యాల జిల్లా మున్సిపాలిటీ పరిధిలో నూకపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో లబ్ధిదారులకు పంపిణీ చేయగా మిగిలిన ఇండ్లకు దరఖాస్తుల స్వీకరణ ఈనెల 17 వరకు పొడిగించినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. అసలైన లబ్ధిదారులు కుల, ఆదాయ సర్టిఫికెట్ తెచ్చుకొనుటలో జాప్యం వలన నష్టపోకుండా ఉండడం కోసం గడువు పెంచినట్లు తెలిపారు. మీసేవ కేంద్రం ద్వారా ఆర్జిదారులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మీసేవ కేంద్రంలో ఆర్జిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వీకరించవలెనన్నారు.