రాజన్నను దర్శించుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే
NEWS Sep 09,2024 05:57 pm
వేములవాడ: కుటుంబ సమేతంగా వేములవాడ రాజన్నను కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి దర్శించుకున్నారు. ఎమ్మెల్యే దంపతులు కోడె మొక్కు చెల్లించుకొన్న అనంతరం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి కళ్యాణమండంలో ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు వేదోక్త ఆశీర్వచనం చేశారు. ఆలయ పర్యవేక్షకులు వరి నర్సయ్య ఎమ్మెల్యేకు శాలువా కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ప్రోటోకాల్ పర్యవేక్షకులు అశోక్, ఎడ్ల శివ, BJP జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ పాల్గొన్నారు.