కాళోజిపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
NEWS Sep 09,2024 05:59 pm
రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల జిల్లా యోజన, క్రీడల శాఖ సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజాకవి పద్మభూషణ్ కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కాళోజి జీవితం సాహిత్యం పై వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎల్.శారదా, తెలుగు ఉపాధ్యాయులు నరేందర్, సతీష్ బాబు, యెలగొండ రవి తదితరులు పాల్గొన్నారు.