ఆకర్షణగా నిలుస్తున్న రుద్రాక్షల గణపతి
NEWS Sep 09,2024 06:01 pm
సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేట్ లో రామ్ లాల్ మండప్ 16 వ వార్షికోత్సవం సందర్భంగా పర్యావరణానికి అనుగుణంగా ఉండాలన్న ఉద్దేశంతో మట్టితో తయారుచేసి రుద్రాక్షలు అమర్చిన గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ గణపతి తయారు చేయడానికి నిజామాబాద్ లో 3 నెలల ముందు ఆర్డర్ ఇవ్వడం జరిగిందని, ఈ మట్టి గణపతి విగ్రహంలో దాదాపు 6000 నుంచి 7000 వరకు రుద్రాక్షలు వాడినట్లు మండప నిర్వాహకులు తెలిపారు. గణపతిని చూడడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు.