అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాస్కెట్ బాల్ గ్రౌండ్ చెరువును తలపిస్తుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రౌండ్ మొత్తం చెరువు లా తయారయింది. తెలియని వారు ఎవరైనా చూస్తే దీనిని చెరువు అని అనుకుంటారు అని స్థానికులు అంటున్నారు. భారీగా నిలిచిన నీటి నుంచి దుర్వాసన వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు.