బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
NEWS Sep 09,2024 05:55 pm
మల్లాపూర్: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన కలాలి నవీన ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. బాధిత కుటుంబానికి గ్రామానికి చెందిన వేంపల్లి మంచి మనుషుల వాట్సాప్ గ్రూపు సభ్యులు రూ. 31,750 నగదు, 50కిలోల బియ్యం అందజేశారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ జలపతి రెడ్డి, గ్రామస్తులు దివాకర్ రెడ్డి, మిడిదొడ్డి మల్లేష్, జలంధర్, పోతు శేఖర్ మురళీ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.