బలహీనంగా ఉన్న గట్లును గుర్తించాలి
NEWS Sep 09,2024 06:04 pm
భారీ వర్షాలు, తుఫాను హెచ్చరిక నేపథ్యంలో సోమవారం కాకినాడ కలెక్టరేట్లో వివిధ జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ షణ్మోహన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలేరు జలాశయం నుంచి విడుదల చేస్తున్న నీటి ప్రవాహానికి కాలువలకు గండ్లు పడకుండా బలహీనంగా ఉన్న గట్లను ముందుగానే అధికారులు గుర్తించాలని సూచించారు.