క్రిటికల్ కేర్ భవనాన్ని పూర్తి చేయాలి: కలెక్టర్
NEWS Sep 09,2024 06:05 pm
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని వైద్య కళాశాల క్రిటికల్ కేర్ విభాగం భవన నిర్మాణాన్ని డిసెంబర్ చివరి లోపు పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ పి.ప్రశాంతి సూచించారు. ఈ మేరకు వైద్య కళాశాల నిర్మాణ పురోగతిపై రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ వద్ద ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న వసతులు, వైద్య సేవలపై కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు.