జమ్మూకశ్మీర్ నౌషెరాలో చొరబాటుకు
యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులు హతం
NEWS Sep 09,2024 04:38 pm
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో భారత్-పాక్ సరిహద్దుల్లో దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని సైన్యం తిప్పికొట్టింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నౌషెరా సెక్టార్‌లో ఇద్దరు ఉగ్రవాదులు అక్రమంగా సరిహద్దులు దాటేందుకు యత్నించారు. గుర్తించిన సైనికులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరు హతమయ్యారు.