అత్యవసరమైతే ఫోన్ చేయండి: కలెక్టర్
NEWS Sep 09,2024 06:06 pm
సిరిసిల్లజిల్లా లోని చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఒక్కరూ కూడా పోషణ లోపంతో బాధపడకూడదని, పోషణ లోపంతో బాధపడేవారికి పోషకాహారం, వైద్య సేవలు అందించాలని, అత్యవసరమైతే నేరుగా నాకు ఫోన్ చేయాలని అంగన్వాడీ సూపర్ వైజర్లను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పోషణమాసంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవల తీరుపై జిల్లాలోని అంగన్వాడీ సూపర్ వైజర్లతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.