అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు
NEWS Sep 09,2024 06:07 pm
అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని ముస్తాబాద్ మండలకేంద్రంలోని తెర్లు మద్ది ఎక్స్ రోడ్ వద్ద పట్టుకున్నట్లు ఎస్సై గణేష్ తెలిపారు. ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన కడమంచి గట్టయ్య అనేవ్యక్తి ప్రభుత్వ ప్రజాపంపిణీ బియ్యంను అక్రమంగా సేకరించిఎక్కువ ధరకు అమ్ముకొనుటకు AP15TC3978 నెంబర్గల ఆటో లోతరలిస్తుండగా తెర్లుమద్ది క్రాస్ రోడ్ వద్ద పట్టుకొని కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్టుతెలిపారు. ఎవరైనా ఇలాంటి అక్రమ బియ్యాన్ని తరలిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని అన్నారు.