మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా.
NEWS Sep 09,2024 04:48 pm
సిరిసిల్ల జిల్లా:సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి,కలెక్టరేట్ ఏవో కి వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ఎన్నోసార్లు విజ్ఞాపణలు చేసినప్పటికీ పరిష్కారం కాకపోవడం వల్ల కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగిందని.దసరా పండగ లోపు సమస్యలు పరిష్కరించాలని, లేక పోతే దసరా తరువాత నిరవధిక సమ్మె చేస్తామని తెలిపారు.