దోస్త్ ప్రవేశాల షెడ్యూల్ లో మార్పులు
NEWS Sep 09,2024 06:07 pm
తెలంగాణలో వర్షాలు, వరదల నేపథ్యంలో డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) స్పెషల్ డ్రైవ్ అడ్మిషన్స్ షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు. అర్హత గల విద్యార్థులు రూ.400 చెల్లించి ఈ నెల 11 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 11 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఈ నెల 10న సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారు. ఈ నెల 12న సీట్లను కేటాయిస్తారు సీట్లు వచ్చిన వారు ఈ నెల 16వరకు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.