ఘనంగా కాళోజి జయంతి వేడుకలు
NEWS Sep 09,2024 04:41 pm
ప్రజాక్షేత్రంలో నిరసన ధ్వనులను వినిపించి ప్రజా చైతన్యాన్ని కలిగించిన గొప్ప వ్యక్తి ప్రజా కవి కాళోజి నారాయణరావు అని దాశరథి పురస్కార గ్రహీత జూకంటి జగన్నాథం, సిరిసిల్లజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఎలగొండ రవి అన్నారు. సోమవారం సిరిసిల్లలోని గాంధీ చౌక్ లో కాళోజి జయంతి వేడుకలని జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి పుష్పాంజలులను ఘటించారు. ఈ కార్యక్రమంలో జనపాల శంకరయ్య, బూర దేవానందం, తదితరులు పాల్గొన్నారు.