ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు
NEWS Sep 09,2024 04:46 pm
రాజన్న సిరిసిల్ల: ప్రజాకవి కాలోజీ నారాయణరావు జన్మదినo పురస్కరించుకొని ఎంపీహెచ్ఎస్ పెద్దూరు పాఠశాలలో తెలంగాణ భాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ఆలపించిన తెలుగు భాషలోని గేయాలు, పాటలు, పద్యాలు, పొడుపు కథలు, నీతి కథలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. మాతృభాష గొప్పతనం గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. తెలుగు భాష ఉపాధ్యాయురాలు భాగ్యనగర్ మాధవిని ప్రధానోపాధ్యాయురాలు చక్రవర్తుల రమాదేవి అభినందిస్తూ సత్కరించారు.