బీసీ స్టడీ సర్కిల్ లో కాళోజి జయంతి వేడుకలు
NEWS Sep 09,2024 04:47 pm
రాజన్న సిరిసిల్ల జిల్లా: బీసీ స్టడీ సర్కిల్ సిరిసిల్లలో కాళోజీ 110 వ జయంతి వేడుకలు సోమవారం బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి మాట్లాడుతూ తెలుగు సాహితీ రంగానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు మరువలేనివని, తెలంగాణ ప్రాంతంలోని ఎంతో మంది కవులకు స్ఫూర్తినిచ్చిన దార్శనీకుడు కాళోజీ నారాయణ రావు అని, తెలంగాణ భాషా పరిరక్షణకు కృషి చేయడంతో పాటు తన కవితలతో ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడు అన్నారు.