కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామం బ్రహ్మంగారి కాలనీలో నీరు చేరింది. గత 4 రోజులు నుండి కురుస్తున్న వర్షాలకు చెరువు గండి పడి పక్కన వున్న కాలనీ లోకి నీరు చేరడంతో కాలనీవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వరద నీరు ఇంట్లోకి రావడం చూసి కూడా అధికారులు గండి పడకుండా చర్యలు తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని స్థానికులు వాపోతున్నారు.