వస్త్ర కార్మికులకు ఉపాధి కల్పించాలి
NEWS Sep 09,2024 04:44 pm
హైదరాబాదులోని చేనేత భవన్ లో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేనేత జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ ను సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కోడం రమణ కలిసి ప్రస్తుతం సిరిసిల్ల పవర్లుమ్ వస్త్ర పరిశ్రమ, టెక్స్టైల్ పార్క్ పరిస్థితి వివరించి, ఉపాధి లేక కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలిపి, వస్త్ర పరిశ్రమ సమస్యల పరిష్కారం అయ్యేవిధంగా చర్యలపై సూచనలు చేసి వినతిపత్రాన్ని అందించడం జరిగిందని తెలిపారు.