అరకు: గెడ్డ దాటవద్దని శిరగం తోకవలస
గ్రామస్తులకు సూచించిన సిఐ హిమగిరి
NEWS Sep 09,2024 06:09 pm
భారీ వర్షాలకు అరకులోయ మండలంలోని గెడ్డలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో శిరగం పంచాయితీలోని కోడిపుంజువలస - తోకవలసల మధ్య ఉన్న గెడ్డ పొంగి ప్రవహిస్తుంది. విషయం తెలుసుకున్న అరకు సిఐ హిమగిరి, ఎస్ఐ సంతోష్ లు విషయాన్ని ఎంఆర్ఓ మండల తాహశీల్దార్ దృష్టిలో పెట్టి తోటవలస గెడ్డ వద్దకు వెళ్లి గ్రామస్తులకు గెడ్డ దాటవద్దని సూచించారు. అనంతరం గెడ్డ వద్ద చెట్ల కొమ్మలు, తాడుతో పోలిస్ పికెట్ ఏర్పాటు చేశారు.