వరద బాధితులకు 1,50,000 అందించిన మహిళా సమాఖ్య సభ్యులు
NEWS Sep 09,2024 06:10 pm
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణం మెప్మా విభాగానికి చెందిన తెలుగు తల్లి పట్టణ సమాఖ్య భరతమాత పట్టణ సమాఖ్య సభ్యులు వారి సొంతంగా కూడబెట్టుకున్న మొత్తంలో 1,50,000 జమ చేసి ఆ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి అందజేశారు.టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు వడ్డే అంజనప్ప మున్సిపల్ వైస్ చైర్మన్ బల రామిరెడ్డి పట్టణ అధ్యక్షులు డి ఈ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.