రెసిడెన్షియల్ విద్యాసంస్థలను తనిఖీ చేయాలి.
NEWS Sep 09,2024 06:10 pm
రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లాలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులు, సౌకర్యాల తీరును తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థల వారీగా 21మంది జిల్లా స్థాయి ప్రభుత్వ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు విద్యాలయాలను తనిఖీ చేయడంతో పాటు ప్రతీ నెలలో ఒక రోజు రాత్రి బస చేయాలని ఆదేశించారు.