ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ చోరీ చేసిన
నిందితుడు అరెస్ట్ రిమాండ్ విధింపు
NEWS Sep 09,2024 06:13 pm
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్లు దొంగతనానికి గురైన సంఘటన కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అదే గ్రామానికి చెందిన నిందితుడు మాసం దిలీప్ ను న్యాయమూర్తి ముందు నేడు హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఎస్సై శేఖర్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు..