రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు గ్రహీత
పాకాల శంకర్ గౌడ్ కు ఆత్మీయ సత్కారం
NEWS Sep 09,2024 06:15 pm
సిరిసిల్ల పట్టణంలోని కుసుమరామయ్య పాఠశాలలో నిర్వహించిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు గ్రహీత పాకాల శంకర్ గౌడ్ ఆత్మీయ సత్కార కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ.. ఎంతో మందివిద్యార్థులన ప్రభావితం చేసి వారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపించేలా వారిలో సృజనాత్మకతను పెంపొందిస్తూ జ్ఞాన దీపికలుగా మార్చిన ఉపాధ్యాయులు పాకాల శంకర్ గౌడ్ కి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు రావడం గర్వకారణం అని అన్నారు.