సిసి కెమరాలను ప్రారంభించిన చందుర్తి సిఐ
NEWS Sep 09,2024 06:16 pm
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మంగళపల్లి గ్రామంలో కమ్యూనిటీ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణలో నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ఆయన తెలిపారు. పోలీసులు నిర్వహిస్తున్న మీకోసంలో భాగంగా సైబర్ నేరాలు గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రత నియమాలు సీసీ కెమెరాల ఉపయోగం, డయల్ 100పై అవగాహన కల్పించారు.