తొలి ట్రిలియనీర్ కానున్న ఎలన్ మస్క్
NEWS Sep 09,2024 02:50 pm
US: స్పేస్ X, టెస్లా కంపెనీ CEO ఎలన్ మస్క్.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలవనున్నాడు. 2027 నాటికి ఆయన ట్రిలియన్ డాలర్లు కలిగిన వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కనున్నట్లు ఇన్‌ఫార్మా కనెక్ట్ అకాడమీ తెలిపింది. మస్క్ వార్షిక సంపద వృద్ధి 109.88గా అంచనా. ప్రస్తుతం 237 బిలియన్ల డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా తొలి స్థానంలో నిలిచారు. ట్రిలియనీర్ క్లబ్‌లో చేరనున్న వారిలో భారతీయ వ్యాపారి గౌతమ్ అదానీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.