హత్నూర మండలం బోరపట్ల శివారులోని అరబిందో ఫార్మా యూనిట్ -1 వద్ద రేపటి నుంచి శాంతియుత ఆందోళన చేపడుతామని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ మేరకు ఈరోజు హత్నూర ఎస్సైకి వినతి పత్రం అందజేశారు. స్థానికంగా ఉన్న యువతకు అవకాశాలు కల్పించకుండా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తులతో పనులు చేయించుకుంటున్నారని పేర్కొన్నారు. స్థానికులకు అవకాశాలు కల్పించాలని రేపటి నుంచి శాంతియుత నిరసన చేపడుతామని వివరించారు.