లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి సేవలపై
బండి సంజయ్ అభినందనలు
NEWS Sep 09,2024 02:11 pm
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేకుర్తిలో కంటి ఆసుపత్రి ద్వారా పేదలకు అందిస్తున్న సేవలు భేష్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభినందించారు. లాభాలను ఆశించకుండా 36ఏళ్లుగా పేదలకు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తూ సేవలందించడం గొప్ప విషయమన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరికీ కంటి ఆసుపత్రి సేవలు విస్తరించేలా ప్రణాళికలు రూపొందించాలని కోరారు. కేంద్ర ఆరోగ్యశాఖతో చర్చించి విస్తరణకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. దీంతో పాటు ఎంపీలాడ్స్ నుండి నిధులన ఆసుపత్రికి మంజూరు చేస్తానన్నారు