మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసిన అదే గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి, మణికంఠ గౌడ్ లను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తూప్రాన్ డిఎస్పి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామంలో తిరుగుతున్న మతిస్థిమితం లేని వ్యక్తిని దొంగగా అనుమానించి ఈనెల 4న దాడి చేసినట్లు వివరించారు. డీఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐ రంగకృష్ణ, ఎస్సై మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.