ఘనంగా కాళోజి జయంతి వేడుకలు
NEWS Sep 09,2024 02:07 pm
కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో కాళోజి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ కాళోజి చిత్రపటానికి పూలమాల, పూలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం ఇతర అధికారులు చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పిచారు. ఈ సందర్బంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ కాళోజి నిజాంకు వ్యతిరేకంగా, తెలంగాణ ఏర్పాటు కోసం చేసిన పోరాటాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఆయన గొప్ప ప్రజాకవి అని, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతని తెలిపారు.