కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో
సమస్యలు పరిష్కరిస్తాం: పొన్నం
NEWS Sep 09,2024 02:14 pm
కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సమస్యలను తొందరలోనే పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసుపత్రి అభివృద్ధి సంఘ సమావేశంలో పేర్కొన్నారు. ప్రాథమిక అవసరాలను వెంటనే పరిష్కరించాలని, మాతా శిశు కేంద్రంలో మరో వంద పడకలు అందుబాటులోకి తేవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో డ్రైనేజీ సమస్యను 15రోజుల్లోగా పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.