తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్త ముత్యాలు అనారోగ్యానికి గురి అయ్యాడు. ఆయన వైద్యానికి చాలా ఖర్చు కావడంతో కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న వైసీపీ నేత చందన నాగేశ్వర్ కార్యకర్త ఇంటికి చేరుకుని వైద్య ఖర్చుల నిమిత్తం రూ.15 వేలు ను కుటుంబ సభ్యులకు అందజేసారు. అలాగే మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సిఫార్సు చేశారు.