వినాయకునికి కలెక్టర్ పూజలు
NEWS Sep 09,2024 02:15 pm
KMR: కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని జనహిత గణేష్ వద్ద జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఉద్యోగులకు సూచించారు. కార్యక్రమంలో జనహిత గణేష్ మండలి ప్రతినిధులు వెంకట్ రెడ్డి, సాయి రెడ్డి, సంతోష్ కుమార్, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.