రైతులకు రాజ్ మా చిక్కుడ్లు పంపిణీ
NEWS Sep 09,2024 02:23 pm
అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలోని చీకుమద్దుల సెగ్మెంట్ రాజ్ మా కందులు పంట సాగు వ్యవసాయంలో మొదటి స్థానంలో ఉండడానికి, సారవంతమైన భూములే కారణమని హుకుంపేట మండల పరిషత్ వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండల రావు అన్నారు. చీకుమద్దుల, గన్నేరు పుట్టు పంచాయితీలోని 200 మంది రైతులకు రాజ్ మా చిక్కుళ్ళు విత్తనాలను హుకుంపేట వైస్ ఎంపిపి సూడిపల్లి కొండలరావు, ఆ రెండు పంచాయితీల సర్పంచ్ లు సూకూరు బొంజన్న దొర, సోకేలి కృష్ణారావులతో కలిసి రైతులకు పంపిణీ చేశారు. అధికంగా రాజ్ మా పండించే రైతులున్న పంచాయితీలు అన్నారు.