ఏలేరు ప్రాజెక్ట్ నుంచి ఆదివారం సాయంత్రం 6000 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేయడంతో జగ్గంపేట మండలంలో ఇర్రిపాకలో ఏలేరు కాలువ ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో ఆదివారం అర్ధరాత్రి 2 గంటల వరకు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాలువ గట్లు పటిష్ట పరిచే పనులను పర్యవేక్షించారు.