కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని కలెక్టర్ అన్నారు. కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కాళోజీ చిత్ర పటానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.