ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
NEWS Sep 09,2024 02:25 pm
ఏలేరు జలాశయం పరీవాహక ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టీడీపీ కాకినాడ జిల్లాధ్యక్షుడు జ్యోతుల నవీన్ అన్నారు. కిర్లంపూడి మండలం రాజుపాలెంలో ఏలేరు కాలువకు గండి పడటంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. ముంపునకు గురైన పొలాలు, ఇళ్లను సందర్శించి ప్రజలతో మాట్లాడారు. లోతట్టు ప్రాంత ప్రజలంతా ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.